హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2)

రాజుల రాజా ప్రభువుల ప్రభువా
రానైయున్నవాడా (2)

మహిమా మహిమా ఆ యేసుకే
మహిమా మహిమా మన యేసుకే (2)    ||హల్లెలూయ||

సూర్యునిలో చంద్రునిలో
తారలలో ఆకాశములో (2)           ||మహిమా||

కొండలలో లోయలలో
జీవులలో ఆ జలములలో (2)       ||మహిమా||

ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా
యుగయుగముల నిత్యుడా (2)    ||మహిమా||